Rahul Gandhi: ప్రధాని మోదీ తెలివితేటలు ఎలాంటివో విడమర్చి చెప్పిన రాహుల్ గాంధీ

  • ఆకాశంలో మబ్బులు ఉంటే రాడార్లు పనిచేయవట!
  • అందుకే సర్జికల్ స్ట్రయిక్స్ విజయవంతం అయ్యాయంటున్నారు
  • పెద్దనోట్ల రద్దు వేళ మంత్రులను ఇంట్లో ఉంచి తాళం వేశారు

గత కొంతకాలంగా ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీపై రాహుల్ విమర్శలు వర్షం కురిపించారు. మోదీ తెలివితేటలు ఎలాంటివో వ్యంగ్యంగా వివరించారు. సర్జికల్ స్ట్రయిక్స్ చేసే సమయంలో ఆకాశం మబ్బులు పట్టి ఉండడం ఎంతో శుభపరిణామం అని, మబ్బుల కారణంగా మన విమానాలు శత్రుదేశపు రాడార్లకు దొరకవని మోదీ చెప్పడం ఆయన తెలివికి నిదర్శనం అని రాహుల్ వ్యాఖ్యానించారు.

"దట్టంగా ఆవరించిన మేఘాల కారణంగా మన విమానాలను పాక్ రాడార్లు గుర్తించలేవంటూ మోదీ చెప్పడాన్ని ఏమనాలి? మబ్బుల కారణంగానే సర్జికల్ స్ట్రయిక్స్ సక్సెస్ అయ్యాయంటున్నారు. ఆయన తన ప్రపంచంలో తానుంటారు తప్ప ఎదుటివాళ్లు చెప్పేది వినిపించుకోరు" అంటూ విమర్శించారు.

అంతేకాకుండా, పెద్దనోట్ల రద్దు సమయంలో క్యాబినెట్ మంత్రులందరినీ తన ఇంట్లోనే ఉంచి తాళం వేసిన వ్యక్తి మోదీ అంటూ ఆరోపించారు. ఈ విషయం తనకు ఎస్ పీజీ భద్రతా బలగాలు చెబితే తెలిసిందని  రాహుల్ వెల్లడించారు. తనకు భద్రత కల్పించడానికి వచ్చిన సెక్యూరిటీ సిబ్బందే తనతో స్వయంగా ఈ విషయం తెలిపారని వివరించారు.

  • Loading...

More Telugu News