aishwarya rajesh: విజయ్ దేవరకొండతో ప్రేమలో పడినట్టుగా వస్తోన్న వార్తలపై స్పందించిన హీరోయిన్

  • ఎవరి ప్రేమలోనూ పడలేదు 
  • అనవసరమైన పుకార్లను నమ్మకండి
  • నా దృష్టి కెరియర్ పైనే వుంది  

తమిళంలో కథానాయికగా వరుస సినిమాలతో ఐశ్వర్య రాజేశ్ దూసుకుపోతోంది. త్వరలో తెలుగులో ఆమె విజయ్ దేవరకొండతో కలిసి క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనుంది కూడా. అలాంటి ఐశ్వర్య రాజేశ్ .. విజయ్ దేవరకొండతో ప్రేమలో పడినట్టుగా ఒక వార్త కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. ఇద్దరూ కలిసి షికార్లు చేస్తున్నారనీ .. పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా వున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఈ విషయంపై ఐశ్వర్య రాజేశ్ స్పందించింది. "నాకు ఒక ప్రేమకథ వుందనీ .. ప్రేమలో ఉన్నాననే వార్తలను కొన్ని రోజులుగా వింటున్నాను. నేను ఎవరితో ప్రేమలో పడ్డాననే విషయం కూడా తెలుసుకోవాలని వుంది" అంటూ విజయ్ దేవరకొండ పేరును ప్రస్తావించకుండానే ట్వీట్ చేసింది. నేను నిజంగానే ఎవరి ప్రేమలోనైనా పడటమంటూ జరిగితే ఆ విషయం నేనే చెబుతా. అనవసరమైన పుకార్లను నమ్మకండి. ప్రస్తుతం నా దృష్టి అంతా కూడా కెరియర్ పైనే వుంది"  అంటూ స్పష్టం చేసింది.

aishwarya rajesh
  • Loading...

More Telugu News