pm: ఓ చారిత్రాత్మక తీర్పు రాబోతోంది.. మళ్లీ సంపూర్ణ మెజార్టీ సాధించబోతున్నాం: ప్రధాని మోదీ
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-33e554a3c2c2e40c7878e95ef88050884040b308.jpg)
- ఈసారి ఎన్నికల ప్రచారం అద్భుతంగా సాగింది
- ఈ ఐదేళ్లలో మంచి పరిపాలన అందించాం
- ఈసారి కూడా ప్రజల ఆశీస్సులు మాపై ఉంటాయని ఆశిస్తున్నా
ఈనెల 23న ఓ చారిత్రాత్మక తీర్పు రాబోతోందని, మళ్లీ సంపూర్ణ మెజార్టీ సాధించబోతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో ప్రధాని మోదీ, అమిత్ షా సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఈసారి ఎన్నికల ప్రచారం అద్భుతంగా సాగిందని చెప్పారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో బీజేపీ మేనిఫెస్టోలో చాలా అంశాలు పెట్టామని అన్నారు. ఐదేళ్ల కిందట ఇదే రోజున బీజేపీకి గొప్ప ఫలితాన్ని ప్రజలు అందించారని గుర్తుచేసుకున్నారు. ఈసారి కూడా ప్రజల ఆశీస్సులు తమపై ఉంటాయని ఆశిస్తున్నానని అన్నారు. ఈ ఐదేళ్లలో మంచి పరిపాలన అందించామని, సోషల్ మీడియా వచ్చిన తర్వాత జవాబుదారీతనం పెరిగిందని అన్నారు. గాంధీపై సాధ్వి ప్రజ్ఞాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, ఈ వ్యాఖ్యలతో తాము విభేదిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు.