bjp: మరోసారి మోదీ ప్రభుత్వం రావడం ఖాయం: అమిత్ షా

  • కూటమి ప్రభుత్వంతో సంపూర్ణ అభివృద్ధి సాధ్యం కాదు
  • బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు
  • అవినీతి నిర్మూలనలో మరింత పురోగతి సాధించాం

కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో ప్రధాని మోదీ, అమిత్ షా సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, 2014లో దేశ ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని, ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్సేతర ప్రభుత్వం వచ్చిందని అన్నారు.

కేంద్రం చేపట్టిన సంక్షేమ పథకాలను బీజేపీ కార్యకర్తలు క్షేత్ర స్థాయికి తీసుకెళ్లారని, దేశ ప్రజల కోసం ప్రభుత్వం 133 పథకాలు ప్రవేశపెట్టామని చెప్పారు. కూటమి ప్రభుత్వంతో ఎన్నటికీ సంపూర్ణ అభివృద్ధి సాధ్యం కాదని, బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. మారుమూల పల్లెల్లోనూ గ్యాస్, విద్యుత్, మరుగుదొడ్లు ఏర్పాటయ్యాయని, రైతులు, మహిళలు, ఎస్సీలకు తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని, దేశంలో అవినీతి నిర్మూలనలో మరింత పురోగతి సాధించామని అన్నారు.

  • Loading...

More Telugu News