Telangana: కాంట్రాక్టర్ల నుంచి వసూళ్లకు కేసీఆర్ అలవాటుపడ్డారు: భట్టి విక్రమార్క ఆరోపణలు

  • ‘వట్టెం’ పనులకు అడ్డంకులు సృష్టిస్తోంది కేసీఆరే 
  • కోర్టుల చుట్టూ తిరుగుతూ, పనులు ఆగిపోయేలా చేస్తున్నారు
  • నిర్వాసితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది

తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీ-కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క ఆరోపణలు గుప్పించారు. వట్టెం ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా కేసీఆర్ అడ్డంకులు సృష్టిస్తున్నారని, కాంట్రాక్టర్ల నుంచి వసూళ్లకు కేసీఆర్ అలవాటుపడ్డారని ఆరోపించారు. సాగునీటి పథకాల నిర్మాణాల్లో సమస్యలు సృష్టిస్తోంది కేసీఆరేనని, కోర్టుల చుట్టూ తిరుగుతూ, ప్రాజెక్టు పనులు ఆగిపోయేలా చేస్తున్నారని విమర్శించారు. భూ నిర్వాసితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, శాంతియుతంగా నిరసన చేస్తున్న వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. 

Telangana
congress
bhatti
vikaramarka
kcr
  • Loading...

More Telugu News