Andhra Pradesh: డబ్బులు, మద్యం పంచకుండా రాజకీయాలు ఎలా చేయాలో జనసేన చూపించింది!: వీవీ లక్ష్మీనారాయణ

  • ప్రజలు ఇప్పటికే తమ ప్రతినిధుల్ని నిర్ణయించుకున్నారు
  • ఏపీ ఎన్నికల్లో జనసేన ప్రభావం స్పష్టంగా ఉంది
  • తూర్పుగోదావరిలో మీడియాతో జనసేన నేత

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ప్రభావం స్పష్టంగా ఉంటుందని ఆ పార్టీ నేత, విశాఖ లోక్ సభ నియోజక వర్గ అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణ తెలిపారు. తమకు ఎవరు ప్రతినిధిగా ఉండాలో ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు. డబ్బులు, మద్యం పంచకుండా రాజకీయాలు ఎలా చేయాలో జనసేన చేసి చూపిందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో ఈరోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు.

‘ఇప్పటివరకూ మూసపోసిన విధానంలోనే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవాలి. మందు ఇచ్చి ఓటు కొనుక్కోవాలి. అని ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని తిరగరాశాం. వారిలో సరికొత్త నమ్మకాన్ని పాదుకొల్పాం. ప్రజల మనసుకు దగ్గరగా వెళితే మనం ఎన్నికలను బ్రహ్మాండంగా జరిపించవచ్చు అని జనసేన నిరూపించింది. సరికొత్త మార్పునకు నాంది పలికింది. దీన్ని ఏపీ అంతా చూసింది’ అని వ్యాఖ్యానించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News