Andhra Pradesh: ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో టీడీపీ నేతలు, మంత్రుల భేటీ!

  • సచివాలయంలోని సీఎస్ ఛాంబర్ కు వచ్చిన నేతలు
  • వైసీపీ ఫిర్యాదును మాత్రమే పట్టించుకుంటున్నారని ఆందోళన
  • 19 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్ మంత్రులు, టీడీపీ నేతలు ఈరోజు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో సమావేశమయ్యారు. అమరావతిలోని సచివాలయానికి ఈరోజు చేరుకున్న టీడీపీ నేతలు, చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహించడంపై తమ అభ్యంతరాలను సీఎస్ దృష్టికి తీసుకొచ్చారు.

ఈసీ తమ ఫిర్యాదును పట్టించుకోకుండా కేవలం ప్రతిపక్ష వైసీపీ ఫిర్యాదును మాత్రమే పట్టించుకుంటోందని ఆరోపించారు. గత నెల 11న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నరసరావు పేట, రాజంపేట, రైల్వే కోడూరు, సత్యవేడు, జమ్మలమడుగు, సత్తెనపల్లి, చంద్రగిరిలోని 19 పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ చోటుచేసుకుందని ఆరోపించారు. కాబట్టి ఈ 19 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Andhra Pradesh
Telugudesam
cs
lv subrmanyam
meeting
19 polling booths
repolling
demand
  • Loading...

More Telugu News