nani: నాని 'గ్యాంగ్ లీడర్' విడుదల తేదీ ఖరారు

  • నాని హీరోగా 'గ్యాంగ్ లీడర్'
  • వినోదభరితంగా సాగే కథ 
  • సంగీత దర్శకుడిగా అనిరుధ్

నాని కథానాయకుడిగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగు పూర్తిచేసుకుంది. ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాను, ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 30వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

ఈ సినిమాకి అనిరుధ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో ఆడదొంగల గ్యాంగ్ కి లీడర్ గా నాని కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. పూర్తి వినోదభరితంగా .. ఆలోచింపజేసే విధంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఇటీవల విడుదలైన 'జెర్సీ'తో హిట్ కొట్టిన నాని, విక్రమ్ కుమార్ తో కలిసి మరో హిట్ కొడతాడేమో చూడాలి. 

  • Loading...

More Telugu News