shivaji: హీరో శివాజీతో మాకు ఎలాంటి సంబంధం లేదు: చలసాని శ్రీనివాస్

  • ప్రత్యేక హోదా సమితితో శివాజీకి సంబంధం లేదు
  • కొన్ని సమయాలలో ఆయన సలహాలను తీసుకున్నాం
  • రానున్న రోజుల్లో హోదా కోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం

ప్రత్యేక హోదా సాధన సమితితో హీరో శివాజీకి ఎలాంటి సంబంధం లేదని ఏపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. ప్రత్యేక హోదాకు మద్దతు ప్రకటించిన వారిలో శివాజీ ఒకరని... కొన్ని సమయాల్లో ఆయన సలహాలను కూడా తీసుకున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా సాధన సమితి నుంచి ఆయన ఎప్పుడో వెళ్లిపోయారని తెలిపారు.

ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించినా... ఆ మద్దతు షరతులతో కూడినదై ఉండాలని చలసాని చెప్పారు. పోరాట పంథాను మార్చాలని, కేంద్రంపై కచ్చితమైన ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. విభజన హామీల అంశంలో అఖిలపక్షానికి స్థానం కల్పించాలని సూచించారు. రానున్న రోజుల్లో హోదా కోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని చెప్పారు.

shivaji
chalasani srinivas
special status
  • Loading...

More Telugu News