Tamil Nadu: మామ లైంగిక వేధింపులు భరించలేక కోడలి ఆత్మహత్య

  • కొడుకు లేని సమయం చూసి నిత్యం వేధింపులు
  • భర్తకు చెప్పినా పట్టించుకోక పోవడంతో మనస్తాపం
  • ఎవరూ లేనప్పుడు ఇంట్లోనే బలవన్మరణం

భర్త ఇంట్లో ఎక్కువ రోజులు ఉండక పోవడాన్ని ఆసరాగా చేసుకుని మామ లైంగిక వేధింపులకు పాల్పడుతుండడంతో భరించలేని కోడలు చివరికి బలవన్మరణానికి పాల్పడింది. తమిళనాడు అరక్కోణం సమీపంలోని తిరుత్తణిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. గ్రామానికి చెందిన మునికృష్ణన్‌, యువరాణి దంపతులు. మునికృష్ణన్‌ వృత్తిరీత్యా లారీ డ్రైవర్‌ కావడంతో ఎక్కువ రోజులు రాత్రి వేళల్లో విధుల్లోకి వెళ్లేవాడు.

ఇదే అదనుగా మునికృష్ణన్‌ తండ్రి ఢిల్లీబాబు, యువరాణిని లైంగికంగా వేధిస్తుండేవాడు. ఈ విషయాన్ని ఆమె భర్త దృష్టికి తీసుకువెళ్లింది. అయితే తన తండ్రిపై  భార్య చాడీలు చెబుతోందన్న ఉద్దేశంతో మునికృష్ణన్‌ వాటిని పట్టించుకోలేదు. మామ వేధింపులు అధికం కావడం, భర్త చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో మనస్తాపానికి గురైన యువరాణి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి వచ్చిన మునికృష్ణన్‌ భార్య ఆత్మహత్య వార్తతో గొల్లుమన్నాడు. మునికృష్ణన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఆత్మహత్యకు కారణమైన ఢిల్లీబాబును అరెస్టు చేశారు.

Tamil Nadu
Crime News
sexual herashment
wome suicide
  • Loading...

More Telugu News