Andhra Pradesh: చంద్రగిరిలో టీడీపీ కార్యకర్తలు దళితులపై రాడ్లు, కర్రలతో దాడిచేశారు!: వైసీపీ నేత చెవిరెడ్డి

  • దళితులు ఓటేయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు
  • సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించే ఈసీ రీ-పోలింగ్ పెట్టింది
  • మీడియాతో మాట్లాడిన చంద్రగిరి ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దళిత వ్యతిరేకి అని వైసీపీ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఎన్ఆర్ కమ్మ‌ప‌ల్లె, క‌మ్మ‌ప‌ల్లె, పులివ‌ర్తి ప‌ల్లె, కొత్త కండ్రిగ‌, వెంక‌ట్రామాపురం గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన ఈసీ రీపోలింగ్ కు ఆదేశించిందని ఆయన స్పష్టం చేశారు. దాన్ని కూడా టీడీపీ నేతలు తప్పుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత నెల 11న పోలింగ్ సందర్భంగా దళితులు ఓటేయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారని చెవిరెడ్డి విమర్శించారు. అప్పుడు రాడ్లు, కర్రలతో టీడీపీ కార్యకర్తలు దళితులపై దాడులు చేశారని ఆరోపించారు. కాబట్టి ఈసారి పోలింగ్ సందర్భంగా ఈసీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా చంద్రగిరిలో వైసీపీ ఘనవిజయం సాధించడం తథ్యమని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News