priyanka gandhi: అమేథీలో నమాజ్.. ఉజ్జయినిలో పూజలు: ప్రియాంకపై స్మృతి ఇరానీ ఫైర్

  • ఓట్ల కోసం నానా పాట్లు పడుతున్నారు
  • రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ చెప్పారు
  • మంత్రదండం లేదని ఇప్పుడు చెబుతున్నారు

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం ఆమె నానా పాట్లు పడుతున్నారని అన్నారు. అమేథీలో నమాజ్ చేశారని... ఇప్పుడు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారని... ఓట్ల కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారని... అధికారంలోకి వచ్చాక మాట తప్పారని స్మృతి దుయ్యబట్టారు. తన వద్ద మంత్రదండం లేదని ఇప్పుడు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

అమేథీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ పోటీ చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ గెలుపు కోసం ప్రియాంకగాంధీ ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించారు.

priyanka gandhi
smriti irani
rahul gandhi
bjp
congress
  • Loading...

More Telugu News