Jaggareddy: ఆ పరిస్థితే వస్తే కనుక రాష్ట్రంలో అధికారం విషయాన్ని పట్టించుకోం: జగ్గారెడ్డి

  • రాష్ట్ర రాజకీయాల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యం
  • అధిష్ఠానానికి లేఖ రాస్తా  
  • పీసీసీ అధ్యక్ష పదవిని శ్రీధర్‌బాబు, రేవంత్‌కి అప్పగించాలి 

రాష్ట్ర రాజకీయాల కంటే తమకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మద్దతుతో ప్రధాని అయ్యే పరిస్థితే వస్తే రాష్ట్రంలో అధికారం విషయాన్ని పట్టించుకోబోమని స్పష్టం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వచ్చిన 40 రోజుల తరువాత ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌లను ఎన్నుకోవడం దారుణమన్నారు. పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొనసాగించాలని అధిష్ఠానానికి లేఖ రాస్తానని తెలిపారు. ఒకవేళ మార్చాల్సి వస్తే కనుక, పీసీసీ అధ్యక్ష పదవిని మొదటి విడతలో శ్రీధర్‌బాబుకి, రెండో విడతలో రేవంత్‌రెడ్డికి ఇవ్వాలని కోరుతానని జగ్గారెడ్డి తెలిపారు.  

Jaggareddy
KCR
Rahul Gandhi
Sridhar babu
Uttam Kumar Reddy
Revanth Reddy
  • Loading...

More Telugu News