Chandragiri: చంద్రగిరి రీపోలింగ్‌ సందర్భంగా ప్రలోభాల పర్వం షురూ!

  • డబ్బు పంచుతుండగా అడ్డుకున్న స్థానికులు
  • ఓటుకు రూ.3 వేల చొప్పున పంపిణీ
  • అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు పోలింగ్ బూత్‌ల పరిధిలో ఈ నెల 19న రీపోలింగ్ జరగనుంది. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి నువ్వా నేనా అన్నట్టుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ప్రతి ఒక్క స్థానాన్ని గెలుచుకోవడం ముఖ్యంగా టీడీపీ, వైసీపీకి చాలా అవసరం. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రలోభాలకు తెరదీస్తున్నాయి. తాజాగా వైసీపీ కార్యకర్తలు డబ్బు పంచుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఓటుకు రూ.3వేలు చొప్పున అందజేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ కార్యకర్తలను అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డబ్బు పంపిణీ చేస్తున్నవారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Chandragiri
Polling Booth
Re Polling
YSRCP
Fan Symbol
Police
  • Loading...

More Telugu News