Sonia Gandhi: 23నే కూటమి సమావేశం.. స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సోనియా!

  • 19న చివరిదశ పోలింగ్.. 23న ఫలితాలు
  • ఇప్పటికే పలు పార్టీలతో చర్చలు
  • నేతలతో స్వయంగా మాట్లాడిన సోనియా 

కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పాటైన మహాగట్‌బంధన్ కూటమి అధికారం చేజిక్కించుకునే దిశగా చకచకా పావులు కదుపుతోంది. గోవా అసెంబ్లీ ఎన్నికల తరహా ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు ప్రణాళికలు రచిస్తోంది. 19న చివరిదశ పోలింగ్ అనంతరం 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో 23నే మహాగట్‌బంధన్ కూటమి సమావేశం అయ్యేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ఇప్పటికే ఈ సమావేశం విషయమై జేడీఎస్ అధినేత దేవెగౌడ, డీఎంకే అధినేత స్టాలిన్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌లతో సోనియా మాట్లాడినట్లు సమాచారం. మరోవైపు కూటమి కార్యకలాపాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి నుంచీ చురుకుగా వ్యవహరిస్తున్నారు. సమయం ఏమాత్రం వృథా కానివ్వకుండా సోనియా ప్రతిపక్షాలన్నింటినీ సిద్ధం చేస్తూ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.

Sonia Gandhi
Chandrababu
Mayavathi
Akhilesh Yadav
Stalin
Devegouda
  • Loading...

More Telugu News