Andhra Pradesh: ప్రజల ఓటు హక్కు కోసం న్యాయపోరాటం చేశాను: చెవిరెడ్డి భాస్కరరెడ్డి

  • 'సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించాకే రీపోలింగ్ కు ఈసీ అనుమతిచ్చింది
  • 7 పోలింగ్ బూత్ లపై ఫిర్యాదు చేస్తే ఐదు చోట్లే రీపోలింగ్!
  • మీడియాతో చెవిరెడ్డి భాస్కరరెడ్డి

చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ నిర్వహించేందుకు ఈసీ అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఓటు హక్కు కోసం న్యాయపోరాటం చేశానని అన్నారు. గత నెల 11న పోలింగ్ రోజున చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన అక్రమాలను సీఈసీ దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయా పోలింగ్ బూత్ లకు సంబంధించిన సీసీ ఫుటేజ్ లను పరిశీలించకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తానని ఈసీకి చెప్పానని అన్నారు. ఈ ఫుటేజ్ లను ఈసీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రీపోలింగ్ కు అనుమతించిందని చెప్పారు. ఏడు పోలింగ్ బూత్ లపై ఫిర్యాదు చేస్తే, ఇందులో ఐదు చోట్ల మాత్రమే రీపోలింగ్ కు ఈసీ అనుమతిచ్చిందని అన్నారు. 

Andhra Pradesh
chandragiri
YSRCP
mla
chevi reddy
bhasker reddy
EC
  • Loading...

More Telugu News