Andhra Pradesh: జగన్ ఒక్కసారి సీఎం కావాలని ప్రజలు కోరుకున్నారు: హాస్యనటుడు పృథ్వీరాజ్
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-5373b57be1cfb9b60394ff6b9700bc113aa46b88.jpg)
- మళ్లీ రాజన్న రాజ్యం ఏర్పడుతుంది
- మే 23 తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది
- టీడీపీ గెలుస్తుందన్నది పగటికలలే
వైఎస్ జగన్ ఒక్కసారి సీఎం కావాలని ప్రజలు కోరుకున్నారని, మే 23 తర్వాత ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నాయకుడు, హాస్యనటుడు పృథ్వీరాజ్ జోస్యం చెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్ సీఎం అవుతారని, మళ్లీ రాజన్న రాజ్యం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని చంద్రబాబునాయుడు పగటికలలు కంటున్నారని, నరకాసుర పాలన అంతానికి ఇంకొద్ది రోజుల సమయమే వుందని వ్యాఖ్యానించారు.