Hyderabad: ప్రజలకు ఉపయోగపడే కొత్త పరిశోధనలు, ఆవిష్కరణలు చేయాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • అణుశక్తి విభాగం, అణు ఖనిజ డైరెక్టరేట్  వార్షికోత్సవం
  • శాస్త్రవేత్తలను అభినందించిన వెంకయ్యనాయుడు
  • వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన

వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఈ రంగంలో సవాళ్లను అధిగమించేలా మరిన్ని పరిశోధనలు జరగాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ లోని బేగంపేటలోని అణుశక్తి విభాగం, అణు ఖనిజ డైరెక్టరేట్ 70వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలతో సమావేశమైన ఆయన వారి కృషిని అభినందించారు. ప్రతిరోజూ కొత్త విషయాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా వివిధ కొత్త పరిశోధనలు, ఆవిష్కరణలు చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో కాలుష్యం, అక్కడి వాతావరణం, మినరల్స్ గురించి అవగాహన కార్యక్రమాలను అణు విభాగం నిర్వహించాలని కోరారు.  

Hyderabad
vice president
Venkaiah Naidu
  • Loading...

More Telugu News