West Bengal: బెంగాల్ ప్రజలతో చెలగాటం ఆడుతున్న తృణమూల్, బీజేపీ: సురవరం సుధాకర్‌రెడ్డి
- అక్కడి హింసకు ఆ రెండు పార్టీలదే బాధ్యత
- ఈశ్వరచంద్ర విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణం
- ఇటువంటి చర్యలు బెంగాల్ సంస్కృతికే అవమానం
పశ్చిమ బెంగాల్ ప్రజల జీవితాలతో అక్కడి అధికార తృణమూల్ కాంగ్రెస్, జాతీయ పార్టీ బీజేపీలు చెలగాటం ఆడుతున్నాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఆ రాష్ట్రంలో చెలరేగిన హింసకు ఈ రెండు పార్టీలదే బాధ్యతని అన్నారు. ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆందోళనకారులు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నామని, ఇటువంటి చర్యలు బెంగాల్ సంస్కృతికే అవమానం అని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ విశ్వసనీయత కోల్పోయిందనేందుకు బెంగాల్‌లో ఒక రోజు ముందు ప్రచారం నిలిపివేయడమే సాక్ష్యమన్నారు. ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రచారం ముగిసి పోవడంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. మతం పేరును ఉపయోగిస్తున్న మోదీ, అమిత్‌షాలపై చర్యలు తీసుకునే ధైర్యం ఈసీకి లేదని విమర్శించారు.