bhanuchandar: కోడి రామకృష్ణగారు నాకు విలన్ గాను .. హీరోగాను హిట్ ఇచ్చారు: భానుచందర్

  • సంగీత దర్శకుడిని కావాలనుకున్నాను
  •  నటన వైపుకు నడిపించింది మా అమ్మనే
  •  'ముక్కు పుడక'తో హీరోగా క్రేజ్

తెలుగు తెరపై యాక్షన్ హీరోగా భానుచందర్ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఆయన స్టార్ హీరోగా కొనసాగారు. అలాంటి భానుచందర్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరియర్ ఆరంభాన్ని గురించి ప్రస్తావించారు. "మా నాన్నగారు మాస్టర్ వేణు మంచి సంగీత దర్శకులు. అందువలన నేను కూడా సంగీత దర్శకుడిగానే నా కెరియర్ ను మొదలుపెట్టాలని అనుకున్నాను. ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు చేశాను.

కానీ నేను నటన వైపుకు వెళ్లడం కరెక్ట్ అని మా అమ్మగారు నన్ను ఈ వైపుకు పంపించారు. తెలుగులో తొలి సినిమాగా 'నాలాగా ఎందరో' చేశాను. ఆ తరువాత 'మనవూరి పాండవులు'లో నటించాను. ఇక తెలుగులో నాకు బ్రేక్ ఇచ్చిన చిత్రం 'తరంగిణి'. కోడిరామకృష్ణగారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నేను చేసిన విలన్ పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ఆయన దర్శకత్వంలోనే వచ్చిన 'ముక్కు పుడక' నన్ను సోలో హీరోగా నిలబెట్టింది" అని చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News