Snake: ఎండకు తాళలేక అలజడి సృష్టించిన నాగుపాము!

  • విశాఖ ఎస్వీకే నగర్ లో ఘటన
  • పూరింట్లోకి దూరిన 10 అడుగుల నాగుపాము
  • చాలా విషపూరితమన్న స్నేక్ క్యాచర్

మండుతున్న ఎండలకు తాళలేక, బయట తిరగలేకపోయిన ఓ భారీ సర్పం, జనావాసాల్లోకి వచ్చి అలజడి సృష్టించింది. విశాఖపట్నం పరిధిలోని ఎన్డీయే జంక్షన్, ఎస్వీకే నగర్ లో ఈ ఘటన జరిగింది. ఓ పూరింట్లోకి దూరిన 10 అడుగుల పొడవున్న నాగుపాము, స్నేక్ క్యాచర్ కు దొరికినా చాలా సేపు బుసలు కొడుతూనే ఉండగా, చూసేవారు ఆశ్చర్యపోయారు.

 ఇక్కడి ఓ పూరింట్లోకి దూరిన పామును చూసిన వారు, మల్కాపురానికి చెందిన స్నేక్ క్యాచర్ కిరణ్ కు కబురు చేయగా, ఆయన వచ్చి కాసేపు కష్టపడి దాన్ని బంధించాడు. ఇది చాలా విషపూరితమైనదని ఆయన చెప్పిన మాటలు విన్న స్థానికుల ఒళ్లు గగుర్పొడిచింది. దీన్ని జనావాసాలకు చాలా దూరంగా విడిచిపెడతామని ఆయన ఈ సందర్భంగా చెప్పాడు. ఇక ఈ పామును ఫోటోలు తీసేందుకు స్థానికులు తమ స్మార్ట్ ఫోన్లతో క్యూ కట్టారు.

Snake
Vizag
Python
Poison
  • Loading...

More Telugu News