anushka: 'సైలెన్స్' కోసం అమెరికా వెళుతోన్న అనుష్క

  • అనుష్క ప్రధాన పాత్రధారిగా 'సైలెన్స్'
  • సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ 
  • అమెరికాలో జరగనున్న షూటింగ్ 

నాయిక ప్రాధాన్యత కలిగిన కథ అనగానే తమిళ దర్శక నిర్మాతలకి నయనతార గుర్తుకు వచ్చినట్టే, తెలుగు దర్శక నిర్మాతలకి అనుష్క గుర్తుకు వస్తుంది. అలా 'భాగమతి' తరువాత నాయికా ప్రాధాన్యత కలిగిన మరో సినిమా చేయడానికి అనుష్క అంగీకరించింది .. ఆ సినిమా పేరే 'సైలెన్స్'.

హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ రూపొందనుంది. కథా పరంగా ఈ సినిమా షూటింగు అమెరికాలో జరగనుంది. అంతా రెడీగా ఉన్నప్పటికీ అనుష్కకి వీసా రాకపోవడం వలన ఆలస్యమైంది. తాజాగా అనుష్కకి వీసా రావడంతో, త్వరలో అమెరికా వెళ్లేందుకు ఈ సినిమా టీమ్ సన్నాహాలు చేసుకుంటోంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ తో పాటు మాధవన్ .. అంజలి .. షాలినీ పాండే నటించనున్నారు.

anushka
madhavan
shalini
  • Loading...

More Telugu News