nani: దొంగల నాయకుడిగా కనిపించనున్న నాని?

  • నాని తాజా చిత్రంగా 'గ్యాంగ్ లీడర్'
  • ప్రధాన పాత్రల్లో ఐదుగురు అమ్మాయిలు
  • చకచకా జరుగుతోన్న షూటింగ్  

నాని తాజా చిత్రంగా .. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో నానితో పాటు ఐదుగురు అమ్మాయిలు ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నట్టుగా ఒక వార్త బయటికి రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఈ సినిమా కథా వస్తువు ఏమై ఉంటుందా? అనే విషయం తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిని కనబరుస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని ఐదుగురు అమ్మాయిలు దొంగలుగా కనిపిస్తారని తెలుస్తోంది. ఈ దొంగలకు నాయకుడే నాని అని సమాచారం. అంటే దొంగల గ్యాంగ్ కి నాని లీడర్ గా కనిపిస్తాడన్న మాట. చూస్తుంటే విక్రమ్ కుమార్ మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ నే పట్టుకున్నట్టుగా అనిపిస్తోంది. అసలు నాని ఆ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడే, అందులో ఏదో కొత్త పాయింట్ ఉందనే విషయం చాలా మందికి అర్థమైపోయింది. ఈ సినిమాతో నాని - విక్రమ్ కుమార్ కలిసి హిట్ కొడతారేమో చూడాలి.

  • Loading...

More Telugu News