Florida: నొప్పితో తాళలేక ఏడుస్తూనే కరాటే... గెలిచిన నాలుగేళ్ల చిన్నారి వీడియో... కోటిన్నర వ్యూస్!

  • అనుకున్నది సాధించిన నాలుగేళ్ల చిన్నారి
  • నొప్పిని దిగమింగి టాస్క్ ను పూర్తి చేసిన వైనం
  • వైరల్ అవుతున్న వీడియో

ఆ చిన్నారికి పట్టుమని నాలుగేళ్లు కూడా ఉండవు. అయితే పట్టుదలతో తాను అనుకున్నది సాధించాడు. ఏడుస్తూనే, బాధను దిగమింగుకుని తన ముందున్న టాస్క్ ను పూర్తి చేయగా, ఆ వీడియోకు కోటిన్నర వ్యూస్, మూడు లక్షలకు పైగా లైక్స్, రెండు లక్షలకు పైగా షేర్స్ వచ్చాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది.
కష్టాలు ఎన్ని ఎదురైనా వెనకడుగు వేయని ఆ చిన్నారిలోని దృఢత్వానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘటన జరిగింది. తన ట్రయినర్ ఎరిక్ గియానీ సూచనల మేరకు ఈ చిన్నారి టైల్స్ ను తన కాలితో పగులగొట్టాలి. పలుమార్లు విఫలమైన చిన్నారి నిరాశతో ఏడుస్తూనే వాటిని పగులగొట్టేందుకు ప్రయత్నించి, చివరికి విజయం సాధించాడు. దీంతో అతనిపై స్నేహితులంతా ప్రశంశల వర్షం కురిపించారు. ఆ వీడియోను మీరూ చూడండి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News