vijayawada: గన్నవరం-విజయవాడ మధ్య భారీగా ట్రాఫిక్ జామ్!

  • కేసరపల్లి-రామవరప్పాడు మధ్య మరమ్మతులు
  • వన్ వే ద్వారా వెళుతున్న వాహనాలు
  • ఐదు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు  

కృష్ణా జిల్లా కేసరపల్లి- రామవరప్పాడు మధ్య జాతీయ రహదారికి మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనాలను వన్ వే ద్వారా పంపిస్తున్నారు. దీంతో, గన్నవరం- విజయవాడ మధ్యలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. జాతీయరహదారికి ఇరువైపులా ఐదు కిలోమీటర్ల మేర బస్సులు, లారీలు, ద్విచక్ర వాహనాలు నిలిచిపోయాయి. సుమారు గంటకు పైబడి ఇదే పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనచోదకులు కొంత ఇబ్బంది పడుతున్నారు.

vijayawada
gannavaram
kesarapalli
ramavarappadu
  • Loading...

More Telugu News