Anushka Shetty: బరువు తగ్గడంపై పుస్తకం రాసిన అనుష్క!

  • బరువు పెరిగి కష్టాలు కొని తెచ్చుకున్న అనుష్క
  • రెండేళ్లు కష్టపడి తిరిగి మామూలు స్థితికి
  • త్వరలో విడుదల కానున్న పుస్తకం

'సైజ్ జీరో' సినిమా కోసం అమాంతం బరువు పెరిగిపోయి కష్టాలు కొనితెచ్చుకున్న దక్షిణాది సినిమా తార అనుష్క, ఇప్పుడు తిరిగి సన్నగా తయారై, మళ్లీ మేకప్ వేసుకునేందుకు సిద్ధమైంది. 'సైజ్ జీరో' తరువాత బాహుబలి, భాగమతి సినిమాల్లో నటించి హిట్ కొట్టినా, ఆపై దాదాపు రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండిపోయింది.

పెరిగిన బరువును తగ్గించుకునేందుకు నానాపాట్లూ పడ్డ అనుష్క, ఇప్పుడు తాను బరువు తగ్గిన విధానాన్ని వివరిస్తూ ఓ పుస్తకం రాసిందట. త్వరలోనే ఇది ఇంగ్లీష్ భాషలో విడుదల అవుతుందని సమాచారం. ఇక ప్రస్తుతం అనుష్క, హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపుదిద్దుకోనున్న 'సైలెన్స్' కోసం అమెరికాకు బయలుదేరనుంది. ఈ చిత్రంలో మాధవన్, షాలినీ పాండే తదితరులు నటిస్తున్నారు.  

Anushka Shetty
Weight
Weight Loss
Book
  • Loading...

More Telugu News