Andhra Pradesh: ‘తృణమూల్’ ఫిర్యాదులను మాత్రం ఈసీ పట్టించుకోవట్లేదు!: చంద్రబాబు మండిపాటు

  • పశ్చిమ బెంగాల్ లో బీజేపీ తప్పుడు ఫిర్యాదులు
  • దీనిపై ఈసీ స్పందించడం దారుణం
  • ఎన్నికల సంఘం తీరు సందేహాలు తలెత్తేలా ఉంది

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ నేతలు, అమిత్ షా చేసిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం తక్షణమే స్పందిస్తోంది కానీ, తృణమూల్ నేతల ఫిర్యాదులను మాత్రం పట్టించుకోవడం లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. మోదీకి పదే పదే క్లీన్ చిట్ లు ఇస్తూ, బీజేపీ తప్పుడు ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తోందని దుయ్యబట్టారు. ‘చిత్తశుద్ధి’ అన్న దానిపై సందేహాలు తలెత్తేలా ఎన్నికల సంఘం తీరు ఉందని విమర్శించారు. యాభై శాతం వీవీప్యాట్స్ స్లిప్పులు లెక్కించాలని ఎన్నిసార్లు కోరినా ఈసీ పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు.

Andhra Pradesh
cm
Chandrababu
trinamool
bjp
modi
amit shah
mamata banerjee
  • Loading...

More Telugu News