Telangana: రైల్వే పనుల దృష్ట్యా ‘తెలంగాణ’లో కొన్ని రైళ్లు రద్దు

  • మణుగూరు నుంచి కాజీపేట వెళ్లే రైలు రద్దు
  • భద్రాచలం రోడ్ నుంచి విజయవాడ వెళ్లే రైలు కూడా రద్దు 
  • నేటి నుంచి 31వ తేదీ వరకు వర్తింపు   

తెలంగాణలో రైల్వే పనుల దృష్ట్యా కొన్ని రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఆయా రైళ్ల రద్దుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 6.15 గంటలకు మణుగూరు నుంచి కాజీపేటకు వెళ్లే రైలు (నెం.57657), మధ్యాహ్నం 1.50 గంటలకు కాజీపేట నుంచి మణుగూరు వచ్చే రైలు (57658)ను నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు రద్దు చేసినట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అదే విధంగా, ఉదయం 8 గంటలకు విజయవాడ (67245) నుంచి బయలుదేరి భద్రాచలం రోడ్ చేరుకునే ప్యాసింజర్ రైలు డోర్నకల్ వరకే నడుస్తుందని పేర్కొన్నారు. భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) నుంచి విజయవాడ వెళ్లే రైలు (67246)ను రద్దు చేసినట్టు వివరించారు.

Telangana
soth central railway
manugur-kazipet
  • Loading...

More Telugu News