Telangana: ఈ నెల 27న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి

  • ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాం
  • ఏడు చోట్ల మాత్రమే ఇబ్బందులు తలెత్తాయి 
  • స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశాం 

తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశామని, ఈ నెల 27న ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన సిబ్బందికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఏడు చోట్ల ఇబ్బందులు తలెత్తాయని అన్నారు.

Telangana
zptc
mptc
Election
commissioner
  • Loading...

More Telugu News