cuddapah: ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్

  • పులివెందులలో ఇఫ్తార్ విందు ఇచ్చిన ముస్లింలు
  • ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న జగన్
  • ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన అధినేత

కడప జిల్లా పులివెందులలో ముస్లింలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు వైసీపీ అధినేత జగన్ హాజరయ్యారు. స్థానికంగా ఉన్న వీజే ఫంక్షన్ హాలులో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు, వైసీపీ నాయకులు, మైనారిటీ సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ పాల్గొన్నారు. అనంతరం, ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. జగన్ కు ముస్లింలు ఖర్జూరాలు తినిపించారు. కాగా, పులివెందుల ప్రజలకు జగన్ రేపు కూడా అందుబాటులో ఉండనున్నారు. 

cuddapah
pulivendula
YSRCP
jagan
Iftar
  • Loading...

More Telugu News