Kaleswaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన వ్యాజ్యాలన్నీ కలిపి విచారణ చేపట్టండి: హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వినతి

  • ప్రాజెక్టులోని దశలపై 177 వ్యాజ్యాలు
  • కేసులన్నీ త్వరగా తేల్చాలని కోరిన ప్రభుత్వం
  • మల్లన్న సాగర్ కేసుపై విచారణ వాయిదా

కాళేశ్వరం ప్రాజెక్టులోని వివిధ దశలను సవాల్ చేస్తూ మొత్తం 177 వ్యాజ్యాలు దాఖలయ్యాయని, వాటన్నింటినీ కలిపి విచారణ చేపట్టాలని కోరుతూ సర్కారు బుధవారం అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. ప్రాజెక్టుకు సంబంధించిన కేసులన్నీ త్వరగా తేల్చాలని హైకోర్టును తెలంగాణ ప్రభుత్వం కోరింది.

ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ త్వరగా పూర్తి చేయాల్సి ఉన్నందున వ్యాజ్యాలన్నీ కలిపి విచారణ చేపట్టాలని ప్రభుత్వం కోరింది. అలాగే ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తులు తమకు పునరావాసం చెల్లించకుండా మల్లన్న సాగర్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారంటూ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై నేడు వేసవి సెలవుల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసుపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

Kaleswaram Project
Telangana Government
Mallanna Sagar
High Court
Etigadda kistapur
  • Loading...

More Telugu News