Vivek Oberoi: మమతా బెనర్జీపై మండిపడిన బాలీవుడ్ నటుడు!

  • మోదీ బయోపిక్ లో నటించిన వివేక్ ఓబెరాయ్ 
  • మమతను సద్దామ్ హుస్సేన్ తో పోల్చిన వైనం
  • ప్రజాస్వామ్యానికి దీదీనే ముప్పు అంటూ వివేక్ విమర్శ

బీజేపీ, దాని పరివారంపై ఎవరు విమర్శలు చేసినా వెంటనే స్పందిస్తున్నారు బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్. ఆయన ఇటీవలే పీఎం మోదీ బయోపిక్ లో నటించారు. పక్కా బీజేపీ మద్దతుదారుడిగా గుర్తింపు ఉన్న వివేక్ ఓబెరాయ్ కొన్నిరోజుల క్రితమే కమలహాసన్ హిందూ ఉగ్రవాదం వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఈ కోవలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపైనా వ్యాఖ్యలు చేశారు.

మమతా బెనర్జీ వంటి గౌరవనీయురాలు ఇరాక్ నియంత సద్దామ్ హుస్సేన్ లా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడంలేదని ట్వీట్ చేశారు. విచారించాల్సిన అంశం ఏమిటంటే, దీదీ తనకు తానే ప్రజాస్వామ్యానికి ముప్పులా పరిణమించారు అంటూ ఘాటుగా విమర్శించారు. ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తేజిందర్ పాల్ సింగ్ బగ్గా, బీజేపీ యూత్ వింగ్ కన్వీనర్ ప్రియాంక శర్మలను బెంగాల్ లో గంటల పాటు నిర్బంధించారన్న ఆరోపణల నేపథ్యంలో వివేక్ ఓబెరాయ్ పైవిధంగా స్పందించారు.

Vivek Oberoi
Mamata Banarjee
BJP
  • Loading...

More Telugu News