mamata banerjee: చెప్పినట్టే మమతా బెనర్జీ 24 గంటల్లో ప్రతీకారం తీర్చుకున్నారు: మోదీ

  • ఎన్నికల ఫలితాలపై మమత ఆందోళన చెందుతున్నారు
  • సొంత నీడను చూసి కూడా భయపడుతున్నారు
  • బీజేపీకి పూర్తి మెజార్టీ వస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి

పశ్చిమబెంగాల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీ సందర్భంగా నిన్న హింస చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగాల్ లో నిర్వహించిన ఓ ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. రెండు రోజుల క్రితం ఓ బహిరంగసభలో మమత మాట్లాడుతూ ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పారని... 24 గంటల్లో తన కోరికను నెరవేర్చుకున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ఫలితాలపై మమత భయాందోళనలకు గురవుతున్నారని చెప్పారు. సొంత నీడను చూసి కూడా ఆమె భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

బీజేపీకి పూర్తి మెజార్టీ వస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయని... కానీ దీదీ అసహనం, బెంగాల్ ప్రజల అభిమానం చూసిన తర్వాత... బెంగాల్ మద్దతుతో తాము 300లకు పైగా సీట్లను గెలుచుకోబోతున్నామనే ధీమా కలుగుతోందని మోదీ అన్నారు.

mamata banerjee
modi
bjp
tmc
  • Loading...

More Telugu News