kamal: కమల్ ప్రశ్నకి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన శివాజీ గణేశన్: సీనియర్ కొరియోగ్రఫర్ శ్రీను మాస్టర్

  • శివాజీ గణేశన్ చేసిన 'ఉత్తమ పుత్రన్'
  • నృత్య దర్శకుడిగా చేసిన హీరాలాల్ 
  • హీరాలాల్ గొప్పతనమేనన్న శివాజీ గణేశన్ 

హీరాలాల్ శిష్యుడిగా .. బెస్ట్ కొరియోగ్రఫర్ గా ఎదిగిన శ్రీను మాస్టర్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, శివాజీ గణేశన్ ను గురించి ప్రస్తావించారు. "ఒకసారి కమలహాసన్ .. శివాజీ గణేశన్ గారిని కలవడానికి ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయంలోనే ఆయన 'ఉత్తమ పుత్రన్' సినిమాలోని 'యారడీ నీ మోహినీ ..' అనే సాంగ్ ను గురించిన ప్రస్తావన తెచ్చి, ఆ పాటలో అంత స్టైల్ గా ఎలా డాన్స్ చేయగలిగారు? అని కమల్ అడిగారట.

అప్పుడు శివాజీ గణేశన్ గారు .. " ఇందులో నా గొప్పతనమేమీ లేదు .. ఇదంతా హీరాలాల్ మాస్టర్ గొప్పతనం. ఆయన ఎలా అయితే చేసి చూపించారో నేను అలా చేశానంతే " అన్నారట. ఆ మాట వినగానే కమల్ ఆశ్చర్యపోయి, 'సార్ నేనైతే ఏం చెప్పేవాడినో తెలుసా? నేనే చేశాను అని చెప్పేవాడిని' అన్నారట. ఇదే విషయాన్ని నేను అక్కినేని దగ్గర ప్రస్తావిస్తే, 'శివాజీ గణేశన్ అంతే .. తన క్రెడిట్ మాత్రమే తను తీసుకుంటాడు .. ఎవరి క్రెడిట్ వాళ్లకి ఇచ్చేస్తాడు .. అదే ఆయన గొప్పతనం' అన్నారు అని చెప్పుకొచ్చారు.

kamal
shivaji ganeshan
  • Loading...

More Telugu News