kolkata: స్టేజ్ ధ్వంసం.. కోల్ కతాలో యోగి ఆదిత్యనాథ్ బహిరంగసభ రద్దు

  • పశ్చిమబెంగాల్ లో కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు
  • పరస్పర దాడులకు పాల్పడుతున్న బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు
  • యోగి బహిరంగసభకు చెందిన స్టేజి ధ్వంసం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇప్పటికే ఇరు వర్గాల మధ్య పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రోడ్ షోలు కూడా సక్రమంగా నిర్వహించుకోలేని పరిస్థితి అక్కడ ఉంది.

తాజాగా కోల్ కతాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహిరంగసభ రద్దైనట్టు బీజేపీ తెలిపింది. వేదికను ధ్వంసం చేశారని, వేదికను నిర్మించిన వ్యక్తిని కూడా చితకబాదారని తెలిపింది. మరోవైపు, టీఎంసీపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. హింసకు పాల్పడుతూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. 

kolkata
yogi adityanath
stage
vandalize
bjp
tmc
  • Loading...

More Telugu News