Airtel: ఆదాయమే లక్ష్యంగా... కొన్ని స్కీములను రద్దు చేయనున్న ఎయిర్ టెల్!

  • రూ. 299 పోస్ట్ పెయిడ్ స్కీమ్ ను నిలిపివేసిన ఎయిర్ టెల్
  • అతి త్వరలో రూ. 349, రూ. 399 ప్యాక్ లు కూడా
  • ఏఆర్పీయూను పెంచుకునే ఆలోచనలో ఎయిర్ టెల్

ఇప్పటికే రూ. 299 పోస్ట్ పెయిడ్ స్కీమ్ ను నిలిపివేసిన ఎయిర్ టెల్, అతి త్వరలో రూ. 349, రూ. 399 ప్యాక్ లనూ నిలిపివేయనున్నట్టు తెలుస్తోంది. ఒక్కో కస్టమర్ నుంచి లభించే సగటు ఆదాయం (ఏఆర్పీయూ - యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రూ. 499 కన్నా తక్కువగా ఉండే స్కీమ్ లను తొలగించేందుకు ఎయిర్ టెల్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అంతకన్నా ఎక్కువగా ఉండే రూ. 749, రూ. 999, రూ. 1,599 స్కీమ్ లను మాత్రమే సంస్థ కొనసాగిస్తుందని తెలుస్తోంది. అదే జరిగితే, ఇంతవరకూ తక్కువ ధరకే డేటాను పొందుతున్న ఎయిర్ టెల్ సిమ్ కార్డు యూజర్ల జేబుపై మరింత భారం పడక తప్పదు. కాగా, ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

Airtel
ARPU
Revenue
  • Loading...

More Telugu News