Anantapur District: పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య

  • విషం తాగి బలవన్మరణం
  • ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆలస్యంగా వెలుగులోకి
  • బాధితుడు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఉద్యోగి

ఎన్ని సంబంధాలు చూస్తున్నా ఏదో కారణంతో తప్పిపోతుండడంతో ఇక తనకు పెళ్లికాదేమో అన్న మనస్తాపంతో ఓ బ్యాంకు ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. అనంతపురం నగర శివారులోని రుద్రంపేటకు చెందిన ఉప్పలపాటి నందకుమార్‌ (35) హైదరాబాద్‌లోని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో పని చేస్తున్నాడు. ఇతని వయసు 35 సంవత్సరాలు. గత కొన్నాళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సంబంధాలు వస్తున్నా కుదరడం లేదని మథన పడుతుండేవాడు.

ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం రుద్రంపేటలో ఉంటున్న తండ్రి వెంకట శేషాచలపతిసాయి ఇంటికి వచ్చాడు. తండ్రి, పినతల్లి (సాయి రెండో భార్య) కలిసి ఆ మరునాడు తిరుపతి వెళ్లారు. దీంతో ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించిన నందకుమార్‌ సోమవారం రాత్రి విషం తాగి చనిపోయాడు. తల్లిదండ్రులు తిరుపతి నుంచి తిరిగి వచ్చాక కొడుకు ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Anantapur District
Crime News
bank employee suicide
  • Loading...

More Telugu News