jublee hills: పెండింగ్‌లో 66 చలానాలున్నా.. దర్జాగా కారులో షికారు!

  • తనిఖీల్లో నిర్వాకం బయటపడడంతో ఆశ్చర్యపోయిన పోలీసులు
  • తక్షణం చెల్లించాలని ఆదేశం
  • చెల్లించలేననడంతో కారు సీజ్‌

ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన, డ్రైవింగ్‌ నిబంధనలు పాటించక పోవడం తదితర అంశాలకు సంబంధించి ఏకంగా 66 చలానాలు తన కారు మీద ఉన్నా అదేమీ పట్టనట్టు తిరుగుతున్న వ్యక్తి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతను చెల్లించాల్సిన మొత్తం చూసి పోలీసులే ఆశ్చర్యపోయి కారును సీజ్‌ చేశారు.

ట్రాఫిక్‌ పోలీసుల కథనం మేరకు... హైదరాబాద్, నల్లకుంట పద్మకాలనీకి చెందిన కోటేశ్వరరావు కంద్రకొండ ఏపీ 09సీబీ 3132 నంబరుతో తన పేరున ఉన్న కారులో మంగళవారం జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 17లో వెళ్తున్నాడు. ఆ సమయంలో ఆ రోడ్డులో తనిఖీలు నిర్వహిస్తున్న ఏఎస్‌ఐ గోపాల్‌ కారు ఆపి తనిఖీ చేశారు.

ఆ తర్వాత ఆ కారు నంబర్‌పై ఉన్న చలానాలు పరిశీలించి ఆశ్చర్యపోయారు. మొత్తం 66 పెండింగ్‌ చలానాలు ఉండగా అతను 75,710 రూపాయలు చెల్లించాల్సి ఉందని గుర్తించారు. తక్షణం ఆ మొత్తం చెల్లించాలని కోరారు. అప్పటికప్పుడు తాను చెల్లించలేనని కోటేశ్వరరావు చెప్పడంతో కారును సీజ్‌ చేశారు.

jublee hills
car chalanas
66 pending
car seig
  • Loading...

More Telugu News