pawan kalyan: గాజువాకలో పవన్ కల్యాణ్ ఎన్నికల ఖర్చు ఎంతంటే..?
- పవన్ కల్యాణ్ ఖర్చు రూ. 8,39,790
- సబ్బం హరి ఖర్చు రూ. 11,18,617
- కేకే రాజు ఖర్చు రూ. 2,43,711
ఈ ఎన్నికల్లో ఏపీలో డబ్బు ఏరులై పారిందనే విషయం ఎవరినడిగినా చెబుతారు. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు కోట్లాది రూపాయలను ఖర్చు చేశారనేది జగమెరిగిన విషయం. కానీ అభ్యర్థులు చూపుతున్న ఖర్చు మాత్రం అందరూ ముక్కున వేలేసుకునేలా ఉంది. నిబంధనల ప్రకారం అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులకు రూ. 28 లక్షలు, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులకు రూ. 70 లక్షల వరకు వ్యయ పరిమితి ఉంది. కానీ, మన అభ్యర్థులు అందులో సగం కూడా ఖర్చు చేయలేకపోయారు. వీరు సమర్పించిన లెక్కలు చూసి అధికారులు సైతం అవాక్కయ్యారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ. 8,39,790 ఖర్చు చేసినట్టు చూపించారు. గంటా శ్రీనివాసరావు (టీడీపీ) రూ. 23,19,325 ఖర్చు చేశారు. సబ్బం హరి (టీడీపీ) రూ. 11,18,617 ఖర్చుగా చూపించారు. గుడివాడ అమర్ నాథ్ (వైసీపీ) రూ. 12,60,554 ఖర్చు చేశారు. విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి కేకే రాజు కేవలం రూ. 2,43,711 మాత్రమే ఖర్చు చేసినట్టు చూపించారు.