bihar: బీహార్‌లోని గయలో దారుణం.. 12వ తరగతి విద్యార్థినిపై బాలుడి అత్యాచారం

  • నిందితుడు కూడా 12వ తరగతి విద్యార్థే
  • ట్యూషన్ నుంచి వస్తుండగా నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం
  • పరారీలో ఉన్న బాలుడి కోసం పోలీసుల గాలింపు

బీహార్‌లో మరో దారుణం జరిగింది. 12వ తరగతి చదువుతున్న అమ్మాయిపై ఓ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గయ జిల్లాలో మంగళవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధిత బాలిక ట్యూషన్ నుంచి వస్తుండగా కాపు కాసిన బాలుడు ఆమెను బలవంతంగా నిర్జన ప్రదేశానికి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడైన బాలుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్టు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్సెస్పీ) చెప్పారు. బాలుడు ఆమె సహచరుడేనని, అతడు కూడా 12వ తరగతి చదువుతున్నాడని ఆయన పేర్కొన్నారు. బాధిత బాలికను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

bihar
gaya
girl
student
boy
Rape
  • Loading...

More Telugu News