mother inlaw murder: అత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు... భార్యపైనా దాడి!

  • భార్య పరిస్థితి విషమం
  • జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఘటన
  • నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు

విభేదాల నేపథ్యంలో ఆగ్రహావేశాలకు లోనైన ఓ వ్యక్తి అత్త, భార్యపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో అత్త అక్కడికక్కడే చనిపోగా భార్య తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం చెన్నాపూర్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసుల కథనం మేరకు గ్రామానికి చెందిన ఒన్నాలక్ష్మి, సుజాత తల్లీకూతుర్లు. సుజాత భర్త వీరిపై దాడికి పాల్పడడంతో లక్ష్మి చనిపోయింది. కొన ఊపిరితో ఉన్న సుజాతను స్థానికులు ఆసుపత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ఘటన ఏ కారణంగా చోటుచేసుకుందన్న వివరాలు తెలియరాలేదు.

mother inlaw murder
Jayashankar Bhupalpally District
wife seriusly injured
  • Loading...

More Telugu News