Kona Venkat: ఈ రెండు ప్రశ్నలనూ పవన్ కల్యాణ్ ను అడుగుతూనే ఉంటాను: రచయిత కోన వెంకట్

  • పవన్ కల్యాణ్ తో విభేదాలు లేవు
  • రాజకీయ అంశాల్లోనే తేడా
  • ఎవరో పవన్ ను తప్పుదారి పట్టించారన్న కోన

తనకూ పవన్ కల్యాణ్ కూ మధ్య విభేదాలు లేవని, కొందరు సృష్టించిన అపోహల కారణంగానే ఆయన అభిమానులు తనను టార్గెట్ చేసుకున్నారని రచయిత కోన వెంకట్ వ్యాఖ్యానించారు. తాజాగా, ఓ యూట్యూబ్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, తాము రాజకీయ పరమైన అంశాల్లోనే విభిన్న దారుల్లో నడుస్తున్నామని, మిగతా అన్ని విషయాల్లో పవన్ అంటే తనకు అభిమానమని స్పష్టం చేశారు. అయితే, రెండు విషయాల్లో మాత్రం పవన్ వ్యాఖ్యలను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని, ఆయన్ను ఎప్పుడు కలిసినా ఈ రెండు అంశాలపై ప్రశ్నలను అడుగుతానని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని పాకిస్థాన్ తో పోల్చాల్సిన అవసరం ఏంటన్నది మొదటి ప్రశ్నని, మాయావతితో పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందన్నది రెండో ప్రశ్నని అన్నారు. ఈ రెండు అంశాల విషయంలో ఎవరో పవన్ ను తప్పుదారి పట్టించారని కోన వెంకట్ అభిప్రాయపడ్డారు. 

Kona Venkat
Pawan Kalyan
You Tube
  • Error fetching data: Network response was not ok

More Telugu News