Yadadri Bhuvanagiri District: యాదగిరి నరసింహుని సరికొత్త ప్రసాదం... నేటి నుంచి భక్తులకు!

  • బెల్లంతో లడ్డూల తయారీ
  • 100 గ్రాముల లడ్డూ రూ. 25
  • విక్రయాలు ప్రారంభించామన్న ఈఓ

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తులకు నేటి నుంచి సరికొత్త ప్రసాదం అందుబాటులోకి వచ్చింది. బెల్లంతో తయారు చేసిన లడ్డూ ప్రసాదం విక్రయాలు ప్రారంభించినట్టు దేవస్థానం కార్య నిర్వహణాధికారి ఎన్‌ గీతారెడ్డి వెల్లడించారు. బెల్లంపాకంతో, నిర్ణీత దిట్టంతో మూడు సార్లు లడ్డూలను ప్రయోగాత్మకంగా తయారు చేసి రుచి, నాణ్యతలను పరిశీలించి, కమిషనర్ ఆమోదంపొందిన తరువాత విక్రయాలకు పచ్చజెండా ఊపామని ఆయన అన్నారు. నిన్నటివరకూ యాదాద్రిలో పంచదారతో తయారు చేసిన లడ్డూలను ఒక్కొక్కటీ రూ. 20కి విక్రయించారు. దీని బరువు 100 గ్రాములుగా ఉంటుంది. ఇప్పుడు బెల్లంతో చేసిన 100 గ్రాముల లడ్డూను రూ. 25కు విక్రయిస్తారు.

Yadadri Bhuvanagiri District
Yadagirigutta
Narasimha Swamy
Prasadam
Ladoo
  • Loading...

More Telugu News