Andhra Pradesh: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది.. కర్రలతో దాడిచేసిన గ్రామస్థులు
- శ్రీకాకుళంలోని నైరలో ఘటన
- అడ్డుకున్న వీఆర్వోలను కర్రలతో చావబాదిన గ్రామస్థులు
- ఆసుపత్రికి తరలింపు
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బందిపై గ్రామస్థులు కర్రలతో దాడి చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలోని నైరలో జరిగింది. ఇసుకను లారీల్లో అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారాన్ని అందుకున్న రెవెన్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రెచ్చిపోయిన గ్రామస్థులు కర్రలతో వారిపై దాడికి దిగారు. విచక్షణ రహితంగా కొట్టారు. వారి దాడిలో వీఆర్వోలు చంద్రశేఖర్, విశ్వేశ్వరరావులు గాయపడగా, వీఆర్వోలు చంద్రభూషణరావు, అప్పలనాయుడు, వీఆర్‌ఏ శ్రీరాములు తప్పించుకున్నారు. గ్రామస్థుల చేతిలో గాయపడిన వీఆర్వోలను వెంటనే ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. బాధిత వీఆర్వోల ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.