Lakshmi parvathi: లక్ష్మీపార్వతి, నటి పూనం కౌర్‌లను వేధించింది ఒక్కరేనట.. గుర్తించిన పోలీసులు

  • పూనం కౌర్‌‌‌పై ఎనిమిది నెలలుగా అశ్లీల రాతలు
  • లక్ష్మీపార్వతిపై ఫిబ్రవరి నుంచి వేధింపులు
  • ఫిలింనగర్ కేంద్రంగా అశ్లీల రాతలు

సోషల్ మీడియాలో నటి పూనం కౌర్, వైసీపీ నేత లక్ష్మీపార్వతిలను వేధించింది ఒకరేనని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలుస్తోంది. ఫేస్‌బుక్, యూట్యూబ్ చానళ్లలో అశ్లీల కథనాలు, అసభ్య రాతలతో నటి పూనం కౌర్‌ను గత ఎనిమిది నెలలుగా వేధిస్తుండగా, లక్ష్మీపార్వతిపై ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వేధింపులు మొదలయ్యాయి. వీరిద్దరూ వేర్వేరుగా చేసిన ఫిర్యాదులపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇద్దరినీ వేధిస్తున్నది ఒకరేనని తేల్చారు.

లక్ష్మీపార్వతిపైనా, పూనంకౌర్‌పైనా అసభ్య రాతలు రాస్తున్నది ఒకరేనని గుర్తించిన పోలీసులు ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో మరో వ్యక్తికి కూడా ప్రమేయం ఉందని, హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వీరి కార్యాలయం ఉందని వారి దర్యాప్తులో తేలింది. వీరి రాతల వెనక ఉన్న ఉద్దేశాన్ని పోలీసులు తెలుసుకునే పనిలో పడ్డారు. డబ్బుల కోసమే వీరు ఇలా వేధింపులకు దిగుతున్నారా? లేక వ్యక్తిగత కక్షతో ఇలాంటి ప్రచారం చేస్తున్నారా? అన్న విషయం నిందితులు పట్టుబడిన తర్వాతే తెలుస్తుందని పోలీసులు తెలిపారు.  

Lakshmi parvathi
actress poonam kaur
youtube
Social Media
cyber crime police
Hyderabad
  • Loading...

More Telugu News