Kamal Haasan: కమలహాసన్‌పై చర్య తీసుకోవాలంటూ కోర్టులో పిటిషన్లు దాఖలు

  • గాడ్సేను తొలి హిందూ ఉగ్రవాదిగా పేర్కొంటూ వ్యాఖ్యలు
  • హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పిటిషన్
  • ఐపీసీ సెక్షన్‌ 153-ఏ, 295-ఏ కింద చర్య తీసుకోవాలని వినతి

ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌ హాసన్‌ 'హిందూ ఉగ్రవాది' అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. నేడు ఆయనపై ఢిల్లీలోని మెట్రోపాలిటన్ కోర్టులో విష్ణు గుప్తా అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. మహాత్మాగాంధీని చంపిన గాడ్సే స్వతంత్ర భారతావనిలో తొలి హిందూ ఉగ్రవాది అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, కాబట్టి కమల్‌పై చర్య తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

కమల్‌పై ఐపీసీ సెక్షన్‌ 153-ఏ, సెక్షన్‌ 295-ఏ పై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌దారు కోరారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 16న విచారణ జరగనుంది. మరోవైపు ఇదే అంశంపై బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ కూడా నేడు ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టును ఆశ్రయించారు.  

Kamal Haasan
Hinduism
Vishnu Guptha
Mahatma Gandhi
Nadhuram Gadse
Aswani Upadhyay
  • Loading...

More Telugu News