Amith Shah: కోల్ కతాలో అమిత్ షా కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. ప్రతిగా రెచ్చిపోయిన బీజేపీ కార్యకర్తలు

  • కోల్‌కతా విశ్వవిద్యాలయం వద్ద ఘటన
  • పెద్ద మొత్తంలో హాజరైన బీజేపీ కార్యకర్తలు
  • రోడ్డు పక్కన వాహనాలకు నిప్పు పెట్టిన శ్రేణులు

పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో నేడు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై కొందరు రాళ్లు విసరడంతో ఘర్షణ చెలరేగింది. అమిత్ షా ర్యాలీ కోల్‌కతా విశ్వవిద్యాలయం వద్దకు చేరుకోగానే ఆయన కాన్వాయ్ పైకి కాలేజీ హాస్టల్ నుంచి కొందరు రాళ్లు రువ్వినట్టు సమాచారం. దీంతో ర్యాలీకి పెద్ద మొత్తంలో హాజరైన బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు.

ఘటనతో రెచ్చిపోయిన బీజేపీ శ్రేణులు రోడ్డు పక్కన ఉన్న వాహనాలకు నిప్పంటించాయి. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగినట్టు సమాచారం. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ర్యాలీలో చెలరేగిన ఘర్షణపై అమిత్ షా ఓ ఛానల్‌తో మాట్లాడుతూ, ఈ ఘటనపై తాను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. 

Amith Shah
Kolkata
Rally
Kolkatta University
Convoy
BJP
TMC
  • Loading...

More Telugu News