bjp: బీజేపీ గెలుపుపై రాజ్ నాథ్ సింగ్ ధీమా!

  • మోదీపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగింది
  • 2014 ఎన్నికల్లో కన్నా ఎక్కువ స్థానాలే గెలుస్తాం
  • బీజేపీకి మూడింట రెండొంతుల మెజార్టీ వస్తుంది

సార్వత్రిక ఎన్నికల్లో చివరి దశ ఇంకా ముగియక ముందే కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మోదీపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందని అన్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన స్థానాల కన్నా ఎక్కువ స్థానాలే బీజేపీ గెలుస్తుందని అన్నారు. బీజేపీకి మూడింట రెండొంతుల మెజార్టీ వచ్చే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో పశ్చిమ బెంగాల్ లో హింసాత్మక ఘటనలు జరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం మమతా బెనర్జీ వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు.

bjp
rajnath singh
west bengal
mamata
cm
  • Loading...

More Telugu News