Kamal Haasan: కమలహాసన్ ‘హిందూ ఉగ్రవాది’ వ్యాఖ్యలను సమర్థించిన ఒవైసీ!

  • గాంధీజీని చంపినవాడిని మహాత్ముడు అనాలా?
  • అతను ముమ్మాటికీ టెర్రరిస్టే
  • కపూర్ కమిషన్ కుట్ర కోణాన్ని నిర్ధారించింది

భారత జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను మహాత్ముడని పిలవాలా? లేక రాక్షసుడని పిలవాలా? అని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. స్వతంత్ర భారతావనిలో తొలి ఉగ్రవాది హిందువేననీ, అతని పేరు నాథూరాం గాడ్సే అని నటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమలహాసన్ వ్యాఖ్యానించడాన్ని ఒవైసీ సమర్థించారు.

బాపూ గుండెల్లోకి తూటాలు పేల్చినవాడు రాక్షసుడు కాక మంచివాడు ఎలా అవుతాడని ఒవైసీ అడిగారు. ‘నాథూరాం గాడ్సే లాంటి వ్యక్తిని టెర్రరిస్ట్ అనాలా? లేక హంతకుడు అనాలా? గాంధీజీ హత్య విషయంలో కపూర్ కమిషన్ నివేదికలో కుట్ర విషయం తేటతెల్లమయింది. కాబట్టి గాడ్సేను టెర్రరిస్ట్ అనే చెప్పాలి. అతను నిజంగా ఉగ్రవాదే’ అని స్పష్టం చేశారు.

Kamal Haasan
hindu terrorist
Asaduddin Owaisi
mim
support
  • Error fetching data: Network response was not ok

More Telugu News