YSRCP: మాకు ఇదే చివరి కేబినెట్ సమావేశమని వైసీపీ కలలు కంటోంది: సోమిరెడ్డి ఎద్దేవా

  • ప్రజలకు టీడీపీ ఎంతో చేసింది
  • రాష్ట్రాభివృద్ధికి వైసీపీ అడ్డుపడుతోంది
  • టీడీపీని కాకుండా వైసీపీని ఎలా గెలిపిస్తారు?

తెలుగుదేశం ప్రభుత్వానికి ఇదే చివరి కేబినెట్ సమావేశం అంటూ వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. తమకు ఇదే చివరి కేబినెట్ సమావేశమని వైసీపీ నేతలు కలలు కంటున్నారని అన్నారు. ప్రజలకు ఎంతో చేసిన తమను గెలిపించకుండా రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడే వైసీపీని గెలిపిస్తారని ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నించారు.

ఏపీ కేబినెట్ సమావేశం పంతం కోసం నిర్వహిస్తోంది కాదని, ప్రభుత్వానికి, తమకు ఉన్న హక్కులను పూర్తి స్థాయిలో వినియోగించుకుని నిర్వహిస్తున్న సమావేశమని స్పష్టం చేశారు. కాగా, మరి కొద్ది సేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సాగు, తాగునీరు, కరవు, ‘ఫణి’ తుపాన్, ఉపాధి హామీ అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది.

YSRCP
jagan
Telugudesam
somireddy
Chandrababu
  • Loading...

More Telugu News